పాపం నిహారిక.. క్యూ లైన్ లో మహేష్ బాబును చూడగానే..!
Major Movie Promoting Video Goes Viral. మేజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం.
By Medi Samrat
మేజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం. ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! మహేష్ బాబు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉన్నారు. అందు కోసం పలువురు సోషల్ మీడియా స్టార్స్ ను కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో క్రేజీ వీడియోలను చేస్తూ ఉండే నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో మరో ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. మహేష్ బాబు సినిమా టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడడం విశేషం.
Queues are so much fun with @AdiviSesh and @urstrulyMahesh 🙂#MajorTheFilm #MajorOnJune3rd #Adivisesh #MaheshBabu𓃵 pic.twitter.com/lsUk0tRs9F
— Niharika Nm (@JustNiharikaNm) May 29, 2022
మేజర్ సినిమాను నిహారికతో కలిసి మహేశ్‌బాబు, అడవి శేష్ వినూత్నంగా ప్రమోట్ చేశారు. నిహారిక సినిమా టికెట్ కోసం ఓ థియేటర్ క్యూలో నిల్చుంటుంది. ఒకరి తర్వాత ఒకరిగా వచ్చిన కొందరు ఆమె కంటే ముందు క్యూలో నిల్చుంటారు. నిహారిక వారిని తిడుతూ ఉండగా.. మేజర్ సినిమా హీరో అడవి శేష్ వచ్చి ఆమె ముందు నిల్చుంటాడు. దీంతో నిహారికతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో మహేష్ బాబు కూడా క్యూ మధ్యలో వచ్చి నిలబడతాడు. మహేష్ ను చూడగానే ఫిదా అయిన నిహారిక అయ్యో మీరు లైన్ లో దూరలేదు అని నవ్వుతూ చెబుతుంది. మహేశ్.. మా స్నేహితులను కూడా పిలవొచ్చా? అని ప్రశ్నించగా, అందుకు ఆమె ఓకే అంటుంది. దీంతో లైన్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందర్భంగా మహేశ్ ఫోన్ నంబరు తీసుకోవాలని భావించి అడిగే లోపే అతడు వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది.