మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు

Superstar Maheshbabu Saves One More Little Girl Life. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.

By Medi Samrat
Published on : 22 Feb 2023 7:03 PM IST

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే ఎంతో మంది పిల్లల ప్రాణాలను నిలబెట్టిన మహేష్ బాబు.. మరోసారి ఇంకో పసి హృదయానికి తన వంతు సాయాన్ని అందించారు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన సోషల్ మీడియా ఖాతాలో మహేష్ బాబు గొప్పతనం గురించి ఒక పోస్ట్ పెట్టారు. ఇటీవల తనకు తెలిసిన ఒక పేద కుటుంబంలోని చిన్నారికి శస్త్ర చికిత్స అవసరం అయిందని, ఆ విషయమై నమ్రత గారిని సంప్రదిస్తే వెంటనే వారి వివరాలు తీసుకుని, అనంతరం ఆ చిన్నారి శస్త్ర చికిత్సకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసారని అన్నారు. ఆ చిన్నారి చికిత్స అనంతరం మెల్లగా కోలుకుంటోందని అన్నారు. రెండు వారాల తర్వాత సర్జరీ అయిన చిన్నారి ఫ్యామిలీ నుంచి తనకు మెసేజ్ వచ్చినట్లు నాగవంశీ తెలిపారు. తాము మహేష్ చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఇలాంటి ఎన్నో కుటుంబాల దీవెనలు మహేష్‌తో పాటు ఆయన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాయని నాగ వంశీ చెప్పారు. ఈ విధంగా ఎందరో చిన్నారుల జీవితాల్లో సరికొత్త వెలుగుని నింపుతున్న గొప్ప మనసున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత చిరకాలం వర్ధిల్లాలి అంటూ అందులో ప్రశంసలు గుప్పించారు. నాగవంశీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల శస్త్ర చికిత్స అవసరాలను తీరుస్తున్న మహేష్ బాబు ఫౌండేషన్‌ను స్థాపించినందుకు మహేష్, నమ్రత దంపతులకు పలువురు కృతజ్ఞతలు చెబుతూ వస్తున్నారు.



Next Story