రేపు విచారణకు రాలేను..ఈడీ అధికారులకు మహేశ్‌బాబు లేఖ

సాయి సూర్య డెవలపర్ కేసులో రేపు విచాణకు హాజరుకాలేనని సినీ నటుడు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 27 April 2025 5:30 PM IST

Cinema News, Tollywood, MaheshBabu, SaiSurya Developers, ED, Hyderabad

రేపు విచారణకు రాలేను..ఈడీ అధికారులకు మహేశ్‌బాబు లేఖ

సాయి సూర్య డెవలపర్ కేసులో రేపు విచాణకు హాజరుకాలేనని సినీ నటుడు మహేశ్ బాబు లేఖలో పేర్కొన్నారు. సాయి సూర్య డెవలపర్ కేసులో మహేష్ బాబుని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. మహేష్ బాబు ప్రమోషన్స్ కోసం. 5.9 కోట్ల రూపాయలను తీసుకున్నారు. 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో తీసుకొని... రెండు కోట్ల రూపాయలను క్యాష్ రూపంలో తీసుకున్నారు. మహేష్ బాబు తీసుకున్న డబ్బుల వ్యవహారంపై ఈడి అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు.

విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. షూటింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరు కాలేనని.. మరుసటి రోజు వస్తానని లేఖలో పేర్కొన్నారు. సాయి సూర్య డెవలపర్స్ పైన ఈడీ అధికారులు ఈ నెలలోనే రెండు రోజుల పాటు సోదాలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు ప్రమోషన్ సంబంధించిన పత్రాలు కూడా అక్కడ దొరికాయి ఈ క్రమంలోనే మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చామని ఈడీ అధికారులు చెప్పారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సాయి సూర్య డెవలపర్స్ పేరుతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రజల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశారు. సాయి సూర్య డెవలపర్స్ సతీష్ గుప్త ఈ మేరకు ప్రజలను మోసం చేయడంతో సైబరాబాద్ ఈవో డబ్ల్యూ లో కేసు నమోదు అయింది ఈ కేసులో పోలీసులు సతీష్ కుమార్ ను అరెస్టు చేశారు. ఇదే కేసును సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.. అయితే సాయి సూర్య డెవలపర్స్ పై కేసు నమోదు కావడం ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయి సూర్య డెవలపర్స్, సూరారా ఇండస్ట్రీస్ ఇద్దరు కలిసి మోసాలకు పాల్పడుతున్నట్లుగా ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ఈ రెండు కంపెనీల పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా అందులో మహేష్ బాబు వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఈడీ అధికారులు విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలి అంటూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు.

Next Story