బ్రాండ్ అంబాసిడర్‌ గా మారిన మహేష్ బాబు కుమార్తె సితార

Mahesh Babu's daughter Sitara has become a brand ambassador. మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

By Medi Samrat  Published on  26 May 2023 9:15 PM IST
బ్రాండ్ అంబాసిడర్‌ గా మారిన మహేష్ బాబు కుమార్తె సితార

మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఇన్‌స్టాలో 12లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌ కూడా నిర్వహిస్తోంది. తాజాగా సితార ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ గా మారింది. ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌ కు సంబంధించి అతిపెద్ద యాడ్‌ కాంట్రాక్ట్‌ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్‌ కిడ్‌గా సితార నిలిచింది.

ముంబైలో మహేశ్‌-నమ్రతల సమక్షంలో సితారతో మూడు రోజుల పాటు యాడ్‌ షూట్‌ కూడా చేశారని తెలుస్తోంది. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్‌ కోసం పనిచేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్‌ టీవీల్లో కనిపించనుంది. యాడ్‌లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహేష్ అభిమానులు కూడా ఈ వార్త విని ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Next Story