'మహేష్ - త్రివిక్రమ్' సినిమా మూడో షెడ్యూల్ డేట్ ఫిక్స్

Mahesh Babu Trivikram Movie Update. త్రివిక్రమ్ - మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

By Sumanth Varma k  Published on  10 Feb 2023 7:15 PM IST
మహేష్ - త్రివిక్రమ్ సినిమా మూడో షెడ్యూల్ డేట్ ఫిక్స్
త్రివిక్రమ్ - మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌ డేట్‌ ఏమిటంటే.. తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌కు బయలుదేరిన మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత, ఈ సినిమా 3వ షెడ్యూల్ ను ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఓ బిగ్ హౌస్ లో 35 రోజుల పాటు జరగనున్న సుదీర్ఘ షెడ్యూల్ లో ఈ సినిమా షూట్ జరగనుంది. ప్రస్తుతం ఆ బిగ్ హౌస్ తాలూకు సెట్ వర్క్ జరుగుతోంది.


ఈ సినిమాలో ఓ భారీ చేజింగ్ ఫైట్ ఎపిసోడ్‌ ఉందట. ఈ ఎపిసోడ్ షూట్ తోనే ఫిబ్రవరి 20 నుంచి ఈ సినిమా షూట్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా 'అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇలా వరుస హిట్ చిత్రాలను అందించి ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు త్రివిక్రమ్. దీనికితోడు ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది. అందుకే, మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Next Story