లగ్జరీ థియేటర్‌ను తీసుకొచ్చిన‌ మహేష్ బాబు

AMB సినిమాస్ ద్వారా థియేటర్ రంగంలో రాణిస్తున్న మహేష్ బాబు మరో సరికొత్త థియేటర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

By Medi Samrat  Published on  8 Feb 2025 4:22 PM IST
లగ్జరీ థియేటర్‌ను తీసుకొచ్చిన‌ మహేష్ బాబు

AMB సినిమాస్ ద్వారా థియేటర్ రంగంలో రాణిస్తున్న మహేష్ బాబు మరో సరికొత్త థియేటర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. AMB సినిమాస్ హైదరాబాద్‌లోని అతిపెద్ద మల్టీప్లెక్స్ లో ఒకటి. దీనిని మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌లోని సినీ ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. 2018లో ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్ అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు AMB సినిమాస్ MB LUXE స్క్రీన్‌ను ప్రారంభించింది.

AMB సినిమాస్ భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన థియేటర్లలో ఒకటి, ప్రత్యేక స్క్రీన్‌లు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రిక్లైనర్ సీట్లు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటూ ఉంది. సామాన్యులే కాదు, హైదరాబాద్‌లోని సెలబ్రిటీలందరూ సినిమాలు చూసేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. AMB సినిమాస్ MB LUXE స్క్రీన్‌ను ప్రారంభించింది. ఇందులో సీట్లు, సదుపాయాలు మరింత లగ్జరీగా ఉండనున్నాయి.

Next Story