'మహా సముద్రం' ఉప్పొంగిందా..? అలా ఉన్నారేంటి..? ఆ ఇద్ద‌రు..

Maha Samudram Movie Update. ఆర్ఎక్స్‌-100 సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన టాలెంటెడ్‌ డైరెక్ట‌ర్‌ అజయ్ భూపతి

By Medi Samrat  Published on  29 July 2021 1:55 PM IST
మహా సముద్రం ఉప్పొంగిందా..? అలా ఉన్నారేంటి..? ఆ ఇద్ద‌రు..

ఆర్ఎక్స్‌-100 సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన టాలెంటెడ్‌ డైరెక్ట‌ర్‌ అజయ్ భూపతి చాలా రోజుల గ్యాప్‌ త‌ర్వాత‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం మహా సముద్రం. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులు. అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. జగపతిబాబు, రావు రమేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే.. జగపతిబాబు, రావు రమేశ్ మిన‌హా వీరంద‌రికి హిట్ ప‌క్కా అవ‌స‌రం. అంద‌రూ ప్లాప్స్‌లో ఉన్న‌వారే. వీరంద‌రిని క‌ల‌గ‌లిపి ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర‌యూనిట్‌ ఈ సినిమాకు సంబందించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.


ప్ర‌స్తుతం ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మాస్ ఎంట‌ర్టైనర్ గా తెర‌కెక్కుతున్న మ‌హ‌స‌ముద్రం పై అటు అభిమానుల్లోనూ, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ మొద‌టి నుండి భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌దిలిన పోస్ట‌ర్ల‌తో చిత్ర‌యూనిట్ ఆక‌ట్టుకుంది. తాజాగా రిలీజ్ చేసిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌లో న‌టీన‌టుల అంద‌రి ఎమోష‌న్స్ ఉన్నాయి. శర్వానంద్ - సిద్ధార్థ్ పాత్రల పరంగా చూసుకుంటే.. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ బలంగా ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. శర్వానంద్ - సిద్ధార్థ్ పాత్రలను చాలా బలంగా.. కొత్తగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత‌.


Next Story