బెడిసి కొట్టింది.. ఫైన్ కట్టు మన్సూర్ ఖాన్..!

హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిల‌పై త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ పరువు నష్టం కింద కేసు వేశాడు.

By Medi Samrat  Published on  22 Dec 2023 7:47 PM IST
బెడిసి కొట్టింది.. ఫైన్ కట్టు మన్సూర్ ఖాన్..!

హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిల‌పై త‌మిళ న‌టుడు మన్సూర్ ఆలీ ఖాన్ పరువు నష్టం కింద కేసు వేశాడు. అయితే ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అలాగే మన్సూర్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ సినిమాపై మాట్లాడుతూ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగాయి. చిత్ర ప్రముఖులు ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవి త‌దిత‌రులు త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఖరికి త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పిన అనంత‌రం త‌న ప‌రువుకు భంగం క‌లిగించారంటూ.. త్రిష‌, ఖుష్బూ, చిరంజీవిల‌పై గ‌త నెల‌ మద్రాస్ హైకోర్టులో మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ తెలిపాడు. ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ కేసును కొట్టివేశాడు. పబ్లిసిటీ కోసం మాత్ర‌మే మన్సూర్ కోర్టును ఆశ్రయించాడ‌ని, మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానిని ఖండించ‌డం అనేది సాధారణ మానవ ప్రతిస్పందన అని కోర్టు పేర్కొంది. ఇది ప‌రువున‌ష్టం కిందికి రాదు అంటూ ధ‌ర్మ‌స‌నం అభిప్రాయపడింది. త్రిష‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను మన్సూర్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది.

Next Story