దమ్ముంటే నా సినిమాలను బ్యాన్‌ చేయండి : నిర్మాత నాగవంశీ

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సమావేశంలో ఆయన నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా గురించి నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 1 April 2025 8:24 PM IST

దమ్ముంటే నా సినిమాలను బ్యాన్‌ చేయండి : నిర్మాత నాగవంశీ

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మీడియా సమావేశంలో ఆయన నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా గురించి నెగెటివ్‌ ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు.

సినిమా రిలీజ్‌ తర్వాత రివ్యూలు వచ్చాయి. అప్పుడు ప్రెస్‌ మీట్‌పెట్టాను కానీ నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేశారు అనుకున్నాను. సినిమా బాగా ఆడుతున్నప్పటికీ ఆ రివ్యూల మీద సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి ఆడుతోందని అంటున్నారు. ‘మ్యాడ్ స్క్వేర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదన్నారు.

మీడియా మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయని అన్నారు. నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయని, మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయని తెలిపారు. ద‌మ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టిక‌ల్స్ రాయ‌కండి. నా సినిమాను ఎలా ప్రమోట్‌ చేసుకోవాలో నాకు బాగా తెలుసని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story