మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ రిపోర్టు ఇదే..!

మ్యాడ్ స్క్వేర్ సినిమాకు యూత్ లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.

By Medi Samrat
Published on : 24 March 2025 6:27 PM IST

మ్యాడ్ స్క్వేర్ సెన్సార్ రిపోర్టు ఇదే..!

మ్యాడ్ స్క్వేర్ సినిమాకు యూత్ లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మొదటి భాగం మంచి హిట్ గా నిలవడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. ఈ సినిమా U/A తో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 127 నిమిషాలు. ఈ సినిమాకి తమన్ BGM కంపోజ్ చేస్తున్నారని కూడా టీం సర్ప్రైజ్ ఇచ్చింది. MAD సీక్వెల్ కి భీమ్స్ సంగీత దర్శకుడు అని అందరికీ తెలుసు, కానీ ఇతర చిత్రాల పనులతో బిజీగా ఉండడం వలన థమన్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భీమ్స్ అందించిన పాటలు ఇప్పటికే మంచి హైప్ ను తెచ్చాయి.

Next Story