ప్రభాస్‌ను అవమానించారు.. దూకుడైన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు

'కల్కి' సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, సినీనటి పూనమ్ థిల్లాన్ కు 'మా' అధ్యక్షుడు, హీరో విష్ణు లేఖ రాశారు

By Medi Samrat  Published on  23 Aug 2024 8:45 PM IST
ప్రభాస్‌ను అవమానించారు.. దూకుడైన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు

'కల్కి' సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, సినీనటి పూనమ్ థిల్లాన్ కు 'మా' అధ్యక్షుడు, హీరో విష్ణు లేఖ రాశారు. ఇకపై అలా మాట్లాడకుండా నియంత్రించాలని లేఖలో విష్ణు కోరాడు. మనమంతా నటీనటుల కుటుంబానికి చెందినవాళ్లమని, ఒకరి గురించి మరొకరు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ పై ఇలా కామెంట్ చేయడం తెలుగువారి మనోభావాలను దెబ్బతీసిందన్నారు మంచు విష్ణు.

అర్షద్ వార్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను థియేటర్లలో చివరిగా చూసిన చిత్రం కల్కి 2898 AD అని.. ఆ చిత్రం తనను నిరాశపరిచిందన్నారు. ప్రభాస్ నుండి తాను మ్యాడ్ మాక్స్ లాంటి సినిమాని ఆశించాను, కానీ ప్రబాస్ ఈ చిత్రంలో జోకర్ లా కనిపించాడని అన్నాడు. ఈ మాటలు ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

Next Story