హేమ పోరాటంపై 'మా' నిర్ణయం ఇదే.!

టాలీవుడ్ నటి హేమ.. నేను డ్రగ్స్ తీసుకోలేదు, నా గురించి తప్పుడు వార్తలను ప్రచురించారు అంటూ బలంగా తన వాదనను వినిపించిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  23 Aug 2024 4:27 PM IST
హేమ పోరాటంపై మా నిర్ణయం ఇదే.!

టాలీవుడ్ నటి హేమ.. నేను డ్రగ్స్ తీసుకోలేదు, నా గురించి తప్పుడు వార్తలను ప్రచురించారు అంటూ బలంగా తన వాదనను వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తనను 'మా' లో తిరిగి చేర్చుకోవాలంటూ ఆమె చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. అయితే చివరికి మా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. నటి హేమ మీద విధించిన బ్యాన్ ను ఎత్తి వేస్తున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు.‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన ఎత్తివేస్తూ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో హేమ ఆనందం అంతా ఇంతా కాదు.

కొద్ది రోజుల క్రితం హేమ రేవ్ పార్టీలోనే ఉన్నారని పోలీసులు ఆరోపించడమే కాకుండా.. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో హేమ కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. తనకు డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ రెండు రోజుల కిందట హేమ వీడియో కూడా విడుదల చేశారు. తనపై మీడియా పుకార్లు ప్రచారం చేసిందని ఆరోపించారు. ఎలాంటి టెస్టుకైనా బహిరంగంగా రెడీగా ఉన్నానని మీ ముందు చెప్పడానికి వచ్చానన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అపాంట్‌మెంట్ కావాలని అడగడానికే ఈ వీడియో పెడుతున్నానని ఆ వీడియోలో హేమ చెప్పారు.

Next Story