ఓటీటీలోకి వచ్చేస్తున్న లవర్.. ఎప్పటి నుండి అంటే.?

గుడ్ నైట్ సినిమా సక్సెస్ తో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న మణికందన్.

By Medi Samrat  Published on  13 March 2024 4:24 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న లవర్.. ఎప్పటి నుండి అంటే.?

గుడ్ నైట్ సినిమా సక్సెస్ తో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న మణికందన్. తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. గుడ్ నైట్ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అతడు 'లవర్' పేరుతో ఓ సినిమా చేశాడు. తెలుగులో ట్రూ లవర్ పేరుతో సినిమా విడుదలైంది. ఈ సినిమా త్వరలోనే OTT స్ట్రీమింగ్‌ జరగనుంది.

లవర్ సినిమా తమిళంలో లాల్ సలామ్‌తో పాటు విడుదలైంది. అక్కడ ప్రేక్షకులను మెప్పించగలిగింది. మణికందన్, గౌరీ ప్రియ, కన్న రవిల నటన కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తెలుగులో అనుకున్నంత ఇంపాక్ట్ ఈ సినిమా థియేటర్లలో చూపించలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం మార్చి 27 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన 'లవర్' చిత్రంలో మణికందన్, గౌరీ ప్రియ, కన్నా రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డన్. మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నజరేత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story