వచ్చేస్తోంది 'లవ్ స్టోరీ'

Love Story Movie Release Update. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపొందింది.

By Medi Samrat  Published on  10 Sep 2021 6:49 AM GMT
వచ్చేస్తోంది లవ్ స్టోరీ

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపొందింది. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా.. వాయిదాలు పడుతూ వస్తోంది. వినాయకచవితికి సినిమా విడుదల చేయాలని అనుకున్నారు కానీ అది వీలు పడలేదు. 'సారంగధరియా' పాట సినిమా మీద భారీ అంచనాలను తీసుకుని వచ్చింది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు.

ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఫిదా తర్వాత సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.ఇటీవల విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.


Next Story