ఏజెంట్ టీనా విషయంలో భారీ ప్లాన్ చేసిన లోకేష్

తమిళ, తెలుగు సినిమా అభిమానులు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

By Medi Samrat
Published on : 5 Aug 2025 7:45 PM IST

ఏజెంట్ టీనా విషయంలో భారీ ప్లాన్ చేసిన లోకేష్

తమిళ, తెలుగు సినిమా అభిమానులు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన 'విక్రమ్' సినిమాలో 'ఏజెంట్ టీనా' క్యారెక్టర్ కూడా ఎంతో మందికి నచ్చింది. అందుకోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

2022లో విడుదలైన 'విక్రమ్' చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య వంటి ప్రముఖులు నటించారు. వసంతి పోషించిన 'ఏజెంట్ టీనా' ప్రత్యేకంగా నిలిచింది. ఆమె పాత్ర సినిమాలో కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, చివరి భాగంలో ఆమె యాక్షన్ ఎపిసోడ్ అందరికీ నచ్చింది. కూలీ ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఏజెంట్ టీనా విషయంలో సరికొత్త ప్లాన్స్ తో ఉన్నట్లు వెల్లడించారు. ఏజెంట్ టీనా పాత్రను ప్రత్యేక వెబ్ సిరీస్‌గా చేయబోతున్నానని, దీనిని మరొకరు దర్శకత్వం వహిస్తారని స్పష్టం చేశారు.

Next Story