ఆ ఫ్లాష్ బ్యాక్ తో సీక్వెల్ మొదలవుతుంది

Lokesh Kanagaraj confirms Kaithi 2. లోకేశ్ కనగరాజ్ పేరు ఇప్పుడు దక్షిణాదిన వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  11 Jun 2022 8:00 PM IST
ఆ ఫ్లాష్ బ్యాక్ తో సీక్వెల్ మొదలవుతుంది

లోకేశ్ కనగరాజ్ పేరు ఇప్పుడు దక్షిణాదిన వినిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఖైదీ బ్లాక్ బస్టర్ తర్వాత 'మాస్టర్', 'విక్రమ్' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ దర్శకుడు. విక్రమ్ సినిమాలో ఖైదీ క్యారెక్టర్ ను కూడా చూపించిన సంగతి తెలిసిందే..! ఇక 'ఖైదీ' సినిమాకి సీక్వెల్ ఉందని లోకేశ్ చాలా రోజుల క్రితమే చెప్పాడు. తాజాగా ఖైదీ రెండో భాగం స్టోరీ గురించి లోకేష్ చెప్పుకొచ్చాడు. " హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా మొదలవుతుంది. జైల్లో కబడ్డీ ఆడి ఎన్నో కప్పులు గెలుచుకుంటాడు. ఆ తరువాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. మళ్లీ పోలీసులకు ఆయన అవసరం వస్తుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు.. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలతో ఈ కథ నడుస్తుందని ఆయున చెప్పుకొచ్చాడు.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్‌లో విడుదలైన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్, KGF 2 తర్వాత మలేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. విక్రమ్ సినిమా తమిళనాడులో ఒక వారంలోనే 100 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించింది. ఒక సినిమా కేవలం ఏడు రోజుల్లోనే ఈ మార్కును అందుకోవడం అపురూపమైన విజయం. విక్రమ్ జూన్ 3 న పలు భాషలలో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు చేరువలో ఉంది.










Next Story