డిసెంబర్‌లో ఎన్నికలు? పవన్ సినిమా షూటింగ్‌లు రద్దు!
ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు ఊహాగానాలు చేస్తున్నారు.
By అంజి Published on 30 Aug 2023 8:50 AM ISTడిసెంబర్‌లో ఎన్నికలు? పవన్ సినిమా షూటింగ్‌లు రద్దు!
ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చే అవకాశం ఉందని రాజకీయ పండితులు ఊహాగానాలు చేస్తున్నారు. డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల సూచనప్రాయంగా చెప్పారు. డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఎన్నికలకు సిద్ధమయినట్లుగా తాజాగా వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తుననాయి. అటు రాజకీయాల పరంగా.. ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగానే ఉన్నాయి. ఇది నిజమని తేలితే.. ఇది "ఓజీ", "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాల వెనుక ఉన్న టీమ్‌ల ప్రణాళికలకు విఘాతం కలిగించవచ్చు.
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెనువెంటనే సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన “ఓజీ” టీజర్‌ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు, దర్శకుడు హరీష్ శంకర్ సెప్టెంబర్ 5 న "ఉస్తాద్ భగత్ సింగ్" రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాడు. అయితే, నిజంగానే డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగాలంటే, పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్‌లన్నింటినీ రద్దు చేసుకుని రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.