అది ఫేక్ వీడియో.. నా కుటుంబం సఫర్ అవుతోంది

'Lock Upp' fame Anjali Arora brutally trolled for overacting. అంజలి అరోరా ఇటీవల చాలా కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో తన

By Medi Samrat  Published on  13 Aug 2022 4:15 PM GMT
అది ఫేక్ వీడియో.. నా కుటుంబం సఫర్ అవుతోంది

అంజలి అరోరా ఇటీవల చాలా కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో తన 'కచా బాదం' డ్యాన్స్ వీడియోతో ఫేమ్ అయిన ఆమె.. ప్రస్తుతం కొన్ని ఆఫర్స్ తో బిజీగా ఉంది. తాజాగా అంజలి అరోరా నెటిజన్లపై దుమ్మెత్తిపోసింది. తనపై తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేస్తున్న వారిని ఆమె విమర్శించింది. ఆమె MMS లీక్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతుండగా.. అది ఫేక్ వీడియో అని ఆమె ఖండించింది. ఫేక్ న్యూస్ కారణంగా తన కుటుంబం సఫర్ అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

వ్యూస్ పెంచుకోవడం కోసం అనుమతి లేకుండా తన పేరును వీడియోకు జోడించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తమ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. మంచి జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి పరువు తీయడానికి కొందరు ఈ స్థాయికి దిగజారడం నిజంగా సిగ్గుచేటని విమర్శించింది. ఇలాంటివి చూసిన ప్రతిసారి నా గుండె పగిలిపోతుందని.. తనపై ఇలాంటి ఫేక్ వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది అంజలి. వీటిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

వీడియోలో ఉన్న అమ్మాయి అంజలి అని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా, ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కొందరు ఆమె పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ వీడియో ఫేక్ అని వాదిస్తున్నారు.


Next Story