ఆసక్తిగా 'లైక్‌ షేర్ అండ్‌ సబ్‌స్క్రైబ్‌' ట్రైలర్‌

'Like Share And Subscribe' Movie Trailer Is Out Now. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌, జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా 'లైక్‌ షేర్‌ అండ్‌

By అంజి  Published on  25 Oct 2022 4:40 PM IST
ఆసక్తిగా లైక్‌ షేర్ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌, జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ డిజిటల్‌గా లాంఛ్‌ చేశారు. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్‌ శోభన్‌ ట్రావెల్‌ వ్లోగర్‌ విప్లవ్‌గా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అరకులో సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లాతో లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు కొన్ని సమస్యల్లో పడతారు.

ఆ తర్వాత ఏం జరిగింది..? వారిద్దరూ ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడ్డారనేది సస్పెన్స్‌ లో పెడుతూ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటనే సినిమా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ మూవీలో బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, మైమ్‌ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌ మెంట్‌-ఆముక్త క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.




Next Story