అసత్య ప్రచారం చేస్తున్నారు : మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ పేరుతో పది కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు సింగర్ మంగ్లీపై ఆరోపణలు చేశారు

By -  Medi Samrat
Published on : 11 April 2026 6:00 PM IST

అసత్య ప్రచారం చేస్తున్నారు : మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ పేరుతో పది కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు సింగర్ మంగ్లీపై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ అసత్య ప్రచారానికి తెరలేపారని మంగ్లీ మండిపడ్డారు. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికి ముందే, తానే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును హననం చేసేలా జరుగుతున్న ఈ కుట్రపై చట్టపరంగా పోరాడతానని మంగ్లీ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ డబ్బు తనది కాదని స్పష్టం చేశారు.

Next Story