క్షేమంగా ఉండాలి.. తొందరగా వచ్చేయాలి: మంచు లక్ష్మి

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు.

By -  Medi Samrat
Published on : 2 March 2026 2:44 PM IST

క్షేమంగా ఉండాలి.. తొందరగా వచ్చేయాలి: మంచు లక్ష్మి

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నారు. తన సోదరుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేత, క్షిపణి దాడుల వార్తల నేపథ్యంలో మంచు లక్ష్మి స్పందించారు. విష్ణు, వారి అందమైన కుటుంబం దుబాయ్‌లో క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. కష్టకాలంలో మన సొంత వాళ్ళు ఆపదలో ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నారు.

దుబాయ్ గగనతలంలో డ్రోన్లను ఇంటర్‌సెప్టర్లు అడ్డుకుంటున్న వీడియోను మంచు విష్ణు ఇప్పటికే షేర్ చేశారు. తాము తీవ్ర భయాందోళనలో ఉన్నామని ఆయన చెప్పారు. ఇరాన్ ప్రతీకార దాడుల వల్ల దుబాయ్ ఎయిర్‌పోర్టుకు పాక్షిక నష్టం వాటిల్లింది. దాంతో ఈ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు నిలిపివేశారు.

Next Story