లైలా బాక్సాఫీసు కలెక్షన్స్ వచ్చాయి.. మరీ ఇంత దారుణమా.?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా క్రాష్ అయ్యింది.

By Medi Samrat  Published on  25 Feb 2025 4:30 PM IST
లైలా బాక్సాఫీసు కలెక్షన్స్ వచ్చాయి.. మరీ ఇంత దారుణమా.?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా క్రాష్ అయ్యింది. సినిమాకు ముందు వివాదాలు, ఆ తర్వాత విస్తృత విమర్శలు, దారుణమైన రేటింగ్స్ సినిమాను దెబ్బతీశాయి. ప్రేమికుల రోజున విడుదలైన ఈ సినిమా మొదటి రోజు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. విశ్వక్ సేన్ పోషించిన స్త్రీ పాత్ర విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంది, నెటిజన్లు సినిమాలోని అసభ్యత విషయంలో విశ్వక్ సేన్ పై ఫైర్ అయ్యారు.

విశ్వక్ సేన్ ఏకంగా బహిరంగ లేఖతో ముందుకు వచ్చారు. సినిమాతో అసభ్యత గీత దాటినందుకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో అలాంటి సినిమాలను ఎంచుకోనని కూడా హామీ ఇచ్చాడు. లైలా 8 కోట్ల బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌తో విడుదలైంది. అయితే 1.5 కోట్ల రేంజ్ షేర్‌ను వసూలు చేసి పెద్ద నష్టాన్ని మిగిల్చింది. భగవంత్ కేసరి సినిమా నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ షైన్ స్క్రీన్స్‌కు లైలా పెద్ద నష్టాన్ని మిగిల్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. త్వరలోనే ఓటీటీలో విడుదలవ్వనుంది.

Next Story