బామ్మర్ది చేతిలో హతమైన నటుడు

Lagori film actor found dead. యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన సతీష్ వజ్ర అనే వ్యక్తిని అతని

By Medi Samrat
Published on : 19 Jun 2022 3:30 PM IST

బామ్మర్ది చేతిలో హతమైన నటుడు

యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన సతీష్ వజ్ర అనే వ్యక్తిని అతని సొంత బావమరిది పొడిచి చంపడం కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. కొన్ని నెలల క్రితం సతీష్ భార్య మృతి చెందగా ఇప్పుడు సతీష్ హత్యకు గురయ్యాడు. సతీష్ వజ్ర అనే వ్యక్తి మాండ్యా నుంచి బెంగళూరుకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. బతుకుతెరువు కోసం ఒక సెలూన్ షాప్ కూడా పెట్టుకున్నాడు. ఆయన సెలూన్ కి మంచి పేరు రావడంతో ఎక్కువగా సినీ నటులు వస్తూ ఉండేవారు. అలా వారితో ఏర్పడిన పరిచయాలతో ఆయన లగోరి అనే ఒక సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు.

సతీష్ బసవన్న గుడి సమీపంలోని పట్టనగెరెలో నివాసం ఉండేవాడు. అక్క ఆత్మ‌హ‌త్య‌కు ఆమె భ‌ర్త స‌తీష్ వ‌జ్ర కార‌ణ‌మ‌ని ఆమె సోద‌రుడు భావించాడు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి స‌తీష్ ఇంట్లోకి చొర‌బ‌డి దాడి చేసి చంపేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. సతీష్ అత్తమామలు అతని భార్య మరణానికి కారణమని, అతను ఆమెను హింసించాడని చెప్పాడు. ఆమె మరణానంతరం, బిడ్డను ఆమె కుటుంబ సభ్యుల సంరక్షణకు అప్పగించారు. సతీష్ అప్పుడప్పుడూ ఆ చిన్నారిని చూసేందుకు అక్కడికి వెళ్లేవాడు. అతను పిల్లల కస్టడీ కోసం ప్రయత్నించడం కూడా గొడవకు దారితీసింది. కొన్ని రోజుల క్రితం సతీష్ భార్య ఆత్మహత్యకు పాల్పడి ఉండటమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. సతీష్ షార్ట్ ఫ్లిలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించి తద్వారా కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా ఛాన్స్ అందుకున్నాడు. 'లగోరి' అనే కన్నడ చిత్రంలో సహాయక పాత్రను కూడా పోషించాడు.










Next Story