ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా పాపులారిటీని సంపాదించుకున్న యువతి మోనాలిసా భోంస్లే. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్న మోనాలిసా భోంస్లే మాట్లాడుతూ.. తాను మైనర్ అని వచ్చిన వార్తలు నకిలీవని స్పష్టం చేశారు. కేరళలోని ఒక ఆలయంలో ముస్లిం వ్యక్తితో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ఆమె ఈ విషయంపై స్పందించారు. "నా వయసు 18 సంవత్సరాలు" అని భోంస్లే విలేకరులతో అన్నారు. తమ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నామని, ఆమె మైనర్ అయితే అది సాధ్యం అయ్యేది కాదని ఆమె భర్త కూడా అన్నారు.
"ఆమె వయస్సు 18 సంవత్సరాలు పైబడి ఉంది. లేకపోతే, మా రిజిస్టర్డ్ వివాహం ఎలా సాధ్యమవుతుంది. ఆమె మైనర్ అనే వార్తలన్నీ నకిలీవి. దయచేసి వాటిని నమ్మవద్దు" అని మోనాలిసా భర్త అన్నారు. ఇద్దరూ కేరళలో ఉండాలనుకుంటున్నారా అని విలేకరులు జంటను అడిగినప్పుడు, అది తన భార్య ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తనకు కేరళ అంటే ఇష్టమని, రాష్ట్రంలోనే ఉండాలని కోరుకుంటున్నానని మోనాలిసా భోంస్లే తెలిపారు.