భీమ్లా నాయక్ కోసం మంత్రి కేటీఆర్‌

KTR to grace Bheemla Nayak Pre release event.ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం భీమ్లా నాయక్. సాగ‌ర్ కె.చంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2022 9:00 AM GMT
భీమ్లా నాయక్ కోసం మంత్రి కేటీఆర్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం 'భీమ్లా నాయక్'. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి ఓ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ నెల 21 హైద‌రాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఈవెంట్‌కి తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజ‌రుకానున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మ ఆహానాన్ని మ‌న్నించి ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌స్తాన‌ని చెప్పిన మంత్రి కేటీఆర్‌కు నిర్మాత నాగ‌వంశీ ట్విట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 'భీమ్లా నాయక్' చిత్రం మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కి రీమేక్ గా తెర‌కెక్కింది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Next Story
Share it