నిర్మాతగా మారిన ప్రభాస్ హీరోయిన్

Kriti Sanon launches production house. Fans find a Sushant Singh Rajput connect. కృతి సనన్.. ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

By Medi Samrat  Published on  5 July 2023 4:51 PM IST
నిర్మాతగా మారిన ప్రభాస్ హీరోయిన్

కృతి సనన్.. ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు నిర్మాతగా మారిపోయింది. నటిగా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్ ఇప్పుడు నిర్మాతగా మారింది. 'బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్' పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆమె తన సోదరి నూపుర్ సనన్‌తో కలిసి దీన్ని ప్రారంభించింది. చిత్ర పరిశ్రమలోకి కృతి సనన్ దాదాపు దశాబ్దం నుండి ఉంది.. ఇప్పుడు నిర్మాతగా మారుతోంది. ఆసక్తికరంగా, అభిమానులు ఆమె బ్రాండ్ టైటిల్‌కి.. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కు కనెక్షన్ పెట్టారు.

కృతి సనన్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్‌స్ కు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి కనెక్షన్ ఉందని కొంతమంది అభిమానులు గమనించారు. కృతి, సుశాంత్ ఇద్దరూ మంచి స్నేహితులు.. రాబ్తా (2017)లో కలిసి పనిచేశారు. 2020లో సుశాంత్ మరణించిన తర్వాత కూడా కృతి అతడిని గుర్తుచేసుకుంటూ వస్తోంది. సుశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల క్యాప్షన్‌లలో బ్లూ కలర్ సీతాకోకచిలుకలను తరచుగా ఉపయోగిస్తాడు. ఒక అభిమాని అతనిని అదే విషయం గురించి అడగ్గా.. ఇవి ప్రేమను పంచుతాయంటూ అప్పట్లో సుశాంత్ వివరణ ఇచ్చాడు. తన స్నేహితుడిని ఇలా కూడా కృతి సనన్ గుర్తుపెట్టుకుందంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ ఉన్నారు.


Next Story