ఆ సీన్లపై బేబమ్మ కామెంట్లు వైరల్

Krithi Shetty Comments On Shyam Singha Roy Movie. కృతి శెట్టి.. అదేనండి టాలీవుడ్ 'బేబమ్మ'.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి..

By Medi Samrat  Published on  29 Dec 2021 10:28 AM GMT
ఆ సీన్లపై బేబమ్మ కామెంట్లు వైరల్

కృతి శెట్టి.. అదేనండి టాలీవుడ్ 'బేబమ్మ'.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి.. టాలీవుడ్ లో వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. 'ఉప్పెన' తర్వాత 'శ్యామ్‌సింగరాయ్‌' హిట్ కూడా కృతి శెట్టికి బాగా కలిసొచ్చింది. అయితే శ్యామ్ సింగరాయ్ లో కృతి కాస్త స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్ లో కనిపించడం విశేషం. సినిమాలో సిగరెట్ తాగే సీన్స్, బోల్డ్ సీన్స్ పై బేబమ్మ ఆసక్తికర కామెంట్లు చేసింది. తనకు సిగరెట్‌ తాగే సన్నివేశం సవాల్‌గా అనిపించిందని చెప్పుకొచ్చింది. నేను స్మోకింగ్‌ ఇష్టపడను.. దర్శకుడు చెప్పగానే భయపడ్డా. ఆ సీన్‌ తొలగించమని కూడా అడిగానని తెలిపింది కృతి.

అలాంటి సన్నివేశాల్లో నటించినప్పుడే ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌ మధ్య వేరియేషన్‌ చూపించగలుగుతావని దర్శకుడు రాహుల్‌ సూచించారని తెలిపింది. నా కోసం నికోటిన్‌ లేని హెర్బల్‌ సిగరెట్‌ తెప్పించారని, స్మోకింగ్‌ సీన్‌ ఫొటో షూట్‌ సమయంలో సిగరెట్‌ పట్టుకోగానే చేతులు వణికాయని కూడా వెల్లడించింది. సిగరెట్‌ ఎలా పట్టుకోవాలో, ఎలా తాగాలో మూడు రోజులు నేర్చుకున్నానని కృతి తెలిపింది. బోల్డ్‌, లిప్‌లాక్‌ సన్నివేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తారని.. లిప్‌లాక్‌ నటనలో భాగమేనని నమ్ముతానని తెలిపింది బేబమ్మ.

యాక్షన్‌ సీన్స్‌లానే బోల్డ్‌ సీన్స్‌లోనూ నటిస్తానని.. ప్రత్యేకంగా చూడనని తేల్చి చెప్పింది. నాయకా నాయికల మధ్య కంఫర్ట్‌ను బట్టే లిప్‌లాక్‌ సీన్స్‌ బాగా వస్తాయి. కథలో లిప్‌లాక్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం లేకపోతే నేను నటించనని చెప్పేసింది. ఇక నాగార్జున, నాగ చైతన్యతో నటిస్తున్న 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తయిందని తెలిపింది. రామ్‌-లింగుస్వామి కలయికలో వస్తున్న సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నానని తెలిపింది. విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా, నితిన్‌ హీరోగా 'మాచర్ల నియోజకవర్గం', సుధీర్‌బాబుతో మరో సినిమా చేస్తోంది కృతి శెట్టి.


Next Story
Share it