తన సినిమాలపై వస్తున్న రూమర్లపై స్పందించిన బేబమ్మ

Krithi Shetty About Upcoming Projects. వార్తలపై కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. అవి తప్ప వేరే ఏ సినిమాలో కూడా నటించడం లేదని చెప్పుకొచ్చింది.

By Medi Samrat  Published on  18 May 2021 4:05 PM GMT
Krithi Shetty

కృతి శెట్టి.. టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఉప్పెన సినిమా ఇచ్చిన స్టార్డమ్ ను అమ్మడు బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె డైరెక్టర్ తేజ సినిమాలో నటిస్తోందని, బెల్లం కొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోందని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. హిందీలో వచ్చిన వివాహ్ సినిమా తెలుగు రీమేక్ లో బేబమ్మ నటిస్తోందని కథనాలు వైరల్ అయ్యాయి.

ఈ వార్తలపై కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. అవి తప్ప వేరే ఏ సినిమాలో కూడా నటించడం లేదని చెప్పుకొచ్చింది. నాని, సుధీర్ బాబు, రామ్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నానని తెలిపింది. ఈ మూడు సినిమాల్లో కాకుండా.. వేరే ఏ సినిమాకు కూడా తాను ఓకె చెప్పలేదని తెలిపింది. తన సినిమాల గురించి వస్తున్న రూమర్స్ పై నమ్మకండని తెలిపింది. ఈ మూడు సినిమాలను పూర్తీ చేయడంపైనే తాను దృష్టి పెట్టానని.. మిగతా ఏ సినిమాలను ఒప్పుకున్నా కూడా తాను తప్పకుండా తెలియజేస్తానని చెప్పింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. ఈ కష్ట సమయాల్లో ఒకరికి మరొకరు తోడుగా ఉండాలని సూచించింది. నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ లో కృతి శెట్టి రెండో హీరోయిన్ గా చేస్తూ ఉంది.

కృతి శెట్టి వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోవ‌డం లేద‌ని.. త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండే సినిమాల‌కు మాత్రమే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేయాలనో, గెస్ట్ అప్పియ‌రెన్స్ చేయాల‌నో ఎవ‌రైనా అడిగితే నో చెప్పేస్తుంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తవ్వగానే తప్పకుండా స్టార్ హీరోయిన్ అయిపోతుందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంది.
Next Story
Share it