'క్రాక్' సినిమాకి బ్రేక్.. కారణం ఇదేనా..?
Krack Movie Early Shows Cancelled.మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజాగా నటించిన చిత్రం 'క్రాక్' సినిమాకి బ్రేక్.. కారణం .
By తోట వంశీ కుమార్ Published on 9 Jan 2021 1:52 PM ISTమాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజాగా నటించిన చిత్రం క్రాక్. గోలిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈ సినిమాకి బ్రేక్ పడింది. రిలీజ్ డే మార్నిగ్ షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాంగా ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ తొలుత స్పష్టం చేసింది. అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో ఉదయం 11 గంటల షోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఫ్యాన్స్ భావించారు.
కానీ ఆ షో పడలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు 'ప్రెస్ షో' వేయనున్నట్లు మరొకసారి పీఆర్ టీమ్ తెలిపింది. షో ఆలస్యం అయినందుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పీఆర్‌ఓ వంశీ శేఖర్ పేర్కొన్నారు. ఇక అమెరికాలో శుక్రవారం రాత్రి అంటే.. 8వ తేదీనే ప్రీమియర్స్ పడాలి. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. అలాగే, మార్నింగ్ షో విషయాలోనూ సందిగ్ధత నెలకొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు రవితేజ అభిమానులు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు షోస్ క్యాన్సిల్ అవడానికి డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ కారణం అనుకుంటున్నప్పటికి.. తమిళ చిత్రానికి సంబంధించి 'క్రాక్' నిర్మాతకు ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమని టాక్ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విశాల్ హీరోగా తెరకెక్కిన తమిళ్ మూవీ 'అయోగ్య' చిత్రానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కాంట్రవర్సీలో 'క్రాక్' సినిమా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కారణం చేతనే ఇప్పుడు 'క్రాక్' విడుదలవుతున్న నేపథ్యంలో చెన్నైకి చెందిన నిర్మాణ సంస్థ సినిమా రిలీజ్ ని అడ్డుకుందని సమాచారం. అయితే నిర్మాత ఠాగూర్ మధు రాత్రి నుంచి సదరు నిర్మాణ సంస్థతో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది.