ఆహాలోకి 'కోట బొమ్మాళి పీఎస్' వచ్చేస్తోంది.. ఎప్పుడంటే.?

'కోట బొమ్మాళి పీఎస్' నవంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. మలయాళంలో 'నాయట్టు' సినిమాకి ఇది రీమేక్.

By Medi Samrat  Published on  3 Jan 2024 1:15 PM GMT
ఆహాలోకి కోట బొమ్మాళి పీఎస్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే.?

'కోట బొమ్మాళి పీఎస్' నవంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. మలయాళంలో 'నాయట్టు' సినిమాకి ఇది రీమేక్. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారు. యావరేజ్ అనిపించుకుంది. ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ద్వారా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఓటీటీలోకి విడుదల కానుంది. 'కోటబొమ్మాళి పీఎస్'లో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ పోలీసులుగా పనిచేస్తూ ఉంటారు. ఒక సంఘటనలో ఈ ముగ్గురినీ డిపార్టుమెంటు నిందితులుగా భావిస్తుంది. వారిని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా వరలక్ష్మి శరత్ కుమార్ రంగంలోకి దిగుతుంది. తప్పించుకోడానికి వీరు చేసిన ప్రయత్నమే ఈ సినిమాకు సంబంధించి మిగిలిన కథ.

కోట బొమ్మాళి చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాస్, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమాకు కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చేయగా.. సినిమాటోగ్రాఫర్‌గా జగదీశ్ చీకటి వ్యవహరించారు. తేజ మర్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రజినీ రాజ్ సంగీతం అందించారు. జానపదం ‘లింగిడి’ పాటతో ఈ చిత్రానికి మంచి పాపులారిటీ వచ్చింది.

Next Story