కోటబొమ్మాళి PS సినిమా OTT విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. పొలిటికల్ థ్రిల్లర్ నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఇక థియేటర్లలో కంటే ఈ తరహా సినిమాలకే OTT లో క్రేజ్ ఎక్కువ. కోటబొమ్మాళి PS OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆహా వీడియో ద్వారా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. లింగిడి పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. శ్రీకాంత్ నటనకు సినిమా చూసిన వాళ్ళు కంటతడి పెట్టారు.
తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజిన్ రాజ్ సినిమాకు సంగీతం అందించారు.