హీరోయిన్ మిస్సింగ్ అంటూ నితిన్ పోస్ట్.. షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్!

Kirti Suresh Missing .. Hero Nitin Tweet Viral .. Hyderabad Police Funny Reply. యూత్ హీరో నితిన్ ప్రస్తుతం 'రంగ్ దే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.

By Medi Samrat  Published on  21 March 2021 7:01 AM GMT
Kirti Suresh Missing .. Hero Nitin Tweet Viral .. Hyderabad Police Funny Reply.

గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో కరోనా బీభత్సం ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ పైనే పడింది. ఈ మద్యనే థియేటర్లు ఓపెన్ కావడంతో సినీ సందడి మొదలైంది. ఇటీవల్ చెక్ సినిమాతో ఖంగుతిన్న యూత్ హీరో నితిన్ ప్రస్తుతం 'రంగ్ దే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. తాజాగా హీరో నితిన్ ''మిస్సింగ్‌, కనబడుట లేదు.. డియర్‌ అను. నువ్వు ఎక్కడ ఉన్నా రంగ్‌ దే ప్రమోషన్స్‌లో జాయిన్‌ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్‌'' అంటూ రాసుకొచ్చాడు.


ఈ పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దాంతో ఈ పోస్ట్ పై హైదరాబాద్‌ సిటీ పోలీసులు స్పందించారు. ఆందోళన పడకండి నితిన్‌.. మేము చూసుకుంటాం'' అంటూ ఫన్నీగా రీప్లే ఇచ్చారు. సిటీ పోలీసుల పోస్టుకు స్పందిస్తూ.. నితిన్ మరో పోస్టు చేశాడు. ఫ్యాన్స్ స్పందిస్తారనుకుంటే.. ఇప్పుడు పోలీసులు స్పందించి షాక్ ఇవ్వడంతే వెంటనే వారికి రిప్లై ఇచ్చాడు నితిన్. నవ్వుతు, నమస్కారాలు పెడుతున్న ఎమోజీలను పోస్టు చేశాడు.


ఈ చిత్రానికి సంబంధిచిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. నితిన్ హీరోగా, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్ గా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో 'రంగ్‌దే' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


Next Story