గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ

ప్రముఖ సెలెబ్రిటీ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

By Medi Samrat
Published on : 28 Feb 2025 6:08 PM IST

గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ

ప్రముఖ సెలెబ్రిటీ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వార్తను ఈ జంట తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు. బేబీ సాక్స్ ఫోటోతో ఈ గుడ్ న్యూస్ చెప్పారు.మా జీవితాల్లో అత్యంతవిలువైన బహుమతి రాబోతోందనే క్యాప్షన్‌తో ఫోటోను పోస్ట్‌ చేశారు.

సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫిబ్రవరి, 2023లో రాజస్థాన్‌లో ఒక అందమైన, ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. వర్క్ పరంగా ఈ జంట అనేక ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఉన్నారు. ఈ జంట మాడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో కలిసి నటించనున్నారు. కియారా అద్వానీ వార్ 2లో కూడా కనిపించనుంది. రణవీర్ సింగ్ డాన్ 3 లో కూడా నటిస్తూ ఉంది.

Next Story