కీర్తి సురేష్-అనిరుధ్ పెళ్లిపై.. కీర్తి తండ్రి రియాక్షన్ ఇదే

నటి కీర్తి సురేష్‌ కు పెళ్లి అంటూ వార్తలు రావడం ఇదేమీ కొత్త కాదు.

By Medi Samrat  Published on  18 Sept 2023 12:00 PM IST
కీర్తి సురేష్-అనిరుధ్ పెళ్లిపై.. కీర్తి తండ్రి రియాక్షన్ ఇదే

నటి కీర్తి సురేష్‌ కు పెళ్లి అంటూ వార్తలు రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఆమెకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అవేవీ నిజం కాదని తేలింది. ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి రూమర్స్‌తో కోలీవుడ్ మీడియా దద్దరిల్లింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ని కీర్తి సురేశ్ పెళ్లాడనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంవత్సరం చివరిలో వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి.

ఈ విషయంపై కీర్తి తండ్రి, నిర్మాత-నటుడు జి సురేష్ కుమార్ ఈ పుకార్లను ఖండించారు. ఈ ఊహాగానాలలో నిజం లేదని ధృవీకరించారు. “అందులో ఏ మాత్రం నిజం లేదు. నివేదికలన్నీ నిరాధారమైనవి, అందులో ఏమాత్రం నిజం లేదు. ఆమె పెళ్లికి సంబంధించి పలు వార్తాకథనాలు మా దగ్గరకు వచ్చాయి. కీర్తి సురేష్, అనిరుధ్ పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారం సరైనది కాదు. ఈ వార్తా కథనాలు కేవలం రూమర్లు మాత్రమే" అని చెప్పుకొచ్చారు. కీర్తి తల్లి, మేనకా సురేష్ గతంలో ఓ వ్యాపారవేత్తతో కీర్తి పెళ్లి అంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారు.

Next Story