బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ-2'
Karthikeya 2 Movie Collections. నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కార్తికేయ 2.
By Medi Samrat Published on 15 Aug 2022 8:15 PM ISTనిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 13న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటి రోజు ఈ సినిమా నైజాంలో రూ.1.2 కోట్లు (జీఎస్టీతో కలిపి) రాబట్టింది. కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనుపమ్‌ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా రూపొందించారు. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన విడుదలైంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మూడు కోట్ల 50 లక్షల వసూళ్ల సాధిస్తే.. రెండో రోజు మూడు కోట్లు 81 లక్షల వసూళ్లు సాధించి రెండు రోజులకు గాను ఏడు కోట్ల 31 లక్షల షేర్ వసూళ్లు సాధించింది.
ఇక రెండో రోజు నైజాం ప్రాంతంలో కోటి 36 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 69 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 55 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 29 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 25 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, కృష్ణాజిల్లాలో 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షల వసూళ్లు సాధించింది. కర్ణాటక సహా మిగతా ప్రాంతాలలో 45 లక్షలు వసూళ్లు సాధించిన ఈ సినిమా.. నార్త్ ఇండియాలో 16 లక్షలు వసూళ్లు సాధించింది.
ఇక ఓవర్సీస్ లో రెండు కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏడు లక్షల షేర్ వసూలు సాధించింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 12 కోట్ల 80 లక్షల రూపాయలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్ల 30 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇక ఆదివారం నుండి థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. బాలీవుడ్‌లో ఈ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా', 'రక్షా బంధన్' థియేటర్‌ల కంటే ఎక్కువ థియేటర్స్ ఆడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సక్సెస్ మీట్‌లో నిఖిల్ మాట్లాడుతూ.. 'కార్తికేయ-2 చిత్రానికి ప్రేక్షకులు వంద మార్కులు వేశారు. మూడేళ్ళు మేము పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేశారు. విడుదలైన ప్రతిచోటు నుండి ఈ చిత్రానికి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తుంది. యూఎస్ నుంచి వస్తున్న స్పందన మా అందరికి ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు.