చందూ మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ 2 భారీ హిట్ అందుకుంది. తెలుగులో కంటే నార్త్ లో ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ ను అందుకుంది. ఈ సంవత్సరం అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచి టాలీవుడ్ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. నిఖిల్ సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ కార్తికేయ చేసిన అన్వేషణ గురించి సినిమాలో చూపించారు. కార్తికేయ మూడో భాగం రూపొందనుందని సమాచారం. కార్తికేయ 3కి సంబంధించిన విషయాల గురించి నిఖిల్ మీడియా సంస్థకు వెల్లడించాడు.
ఇండియా టుడేతో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తికేయ 2 విజయం తర్వాత, ఈ సిరీస్ లో మూడవ భాగం తీయబడుతుందని చెప్పుకొచ్చాడు. "అవును, అందరి దీవెనలతో, మేము కార్తికేయ 3ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ చిత్రాన్ని 3Dలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాము." అని నిఖిల్ వెల్లడించాడు.
శ్రీకృష్ణుడి ఇతివృత్తాంతంతో వచ్చిన 'కార్తికేయ2' అయితే సంచలన విజయం సాధించింది. నార్త్ ఆడియెన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా రూ.100కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.