శోకసంద్రంలో వంటలక్క.. పడిపోయిన టీఆర్పీ రేటింగ్: కార్తీక దీపం

karthika deepam serial latest trp rating. కార్తీక దీపం సీరియల్‌.. తెలుగులోనే కాదు.. యావత్‌ భారత్‌దేశంలోని బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌లను నమోదు

By అంజి  Published on  11 Nov 2021 9:27 AM GMT
శోకసంద్రంలో వంటలక్క.. పడిపోయిన టీఆర్పీ రేటింగ్: కార్తీక దీపం

కార్తీక దీపం సీరియల్‌.. తెలుగులోనే కాదు.. యావత్‌ భారత్‌దేశంలోని బుల్లితెరపై రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌లను నమోదు చేసింది. ఇక ఈ సీరియల్‌కి ప్రాణం లాంటిది దీప అలియాస్‌ వంటలక్క క్యారెక్టర్. ఈ పాత్రలో ప్రేమి విశ్వనాథ్‌ తనదైన శైలిలో నటిస్తూ.. బుల్లితెర ప్రేక్షకుల ఆదర అభిమానాలను చూరగొన్నది. సినిమా హీరోయిన్లకు తీసిపోని విధంగా ప్రేమి విశ్వనాథ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. డాక్టర్‌ బాబు.. వంటలక్కతో ఎప్పుడు కలుస్తారు అన్న సస్పెన్స్‌తో ఈ సీరియల్‌ కథ ముందుకు సాగింది. కథలో వాళ్లిదరూ కలిసిన.. విలన్‌ మాత్రం వారిని వదిలిపెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీరియల్‌ టీఆర్పీ రేటు ఓ రేంజ్‌లో సొంతం చేసుకుంది. చూస్తున్నారు కదా అంటూ సీరియల్‌ను రోజురోజుకీ సాగదీసుకుపోతున్నారు.

హమ్మాయా.. వంటలక్క, డాక్టర్‌ బాబు కలిసిపోయారు.. విలన్‌ మోనిత జైలుకు వెళ్లింది ఇక సీరియల్‌ కథ అయిపోయింది అని ప్రేక్షకులు అనుకుంటుండగా మళ్లీ మళ్లీ పాత కథనే ముందుకు సాగిస్తున్నారు. వంటలక్కను శోకసంద్రంలో ముంచేలా.. మోనితను కార్తీక్‌ను దగ్గరగా చేస్తూ కథ సాగుతోంది. మోనిత ఎప్పటిలాగే ప్లాన్స్‌ వేస్తూ వంటలక్కను, డాక్టర్‌ బాబు ఇబ్బందులకు గురి చేయడం ప్రేక్షకులకు బాగా బోర్‌ కొట్టినట్లైంది. దీంతో కార్తీక్‌ దీపం సీరియల్‌వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదు. ఒకప్పుడు రికార్డ్ టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసిన కార్తీక దీపం సీరియల్‌ రేటింగ్‌ ఇప్పుడు దారుణంగా పడిపోయింది. కార్తీక దీపం సీరియల్‌ ముందు ఎలాంటి పెద్ద షోలు, సినిమాలు నిలబడలేకపోయాయి. అయితే ఇప్పుడు పాత సినిమాలకు వస్తున్న రేటింగ్‌లు కూడా రావడం లేదు. కార్తీక దీపం సీరియల్‌ను మళ్లీ మొదటి ప్లేస్‌లో నిలబెట్టాలంటే.. దర్శకుడు కథలో సరికొత్త మార్పులు తీసుకురావాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. లేదంటే ఎండ్‌ కార్డ్‌ అయినా ఇవ్వాలంటున్నారు.

Next Story
Share it