2022 మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల సినీ శెట్టి గెలుచుకుంది. 58వ ఫెమినా మిస్ ఇండియాగా గెలుపొందిన శెట్టి.. ముంబాయిలో జన్మించింది. మిస్ ఇండియా 2020 మానస వారణాసి మిస్ వరల్డ్ పోటీల తదుపరి ఎడిషన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే కిరీటాన్ని సినీ శెట్టికి ఇచ్చింది. మిస్ ఇండియా 2022 పోటీలో 21 ఏళ్ల షినతా చౌహాన్ సెకండ్ రన్నరప్‌గా, రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.
సినీ శెట్టి కర్ణాటకకు చెందిన యువతి. ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA)లో కోర్సును అభ్యసిస్తోంది. ప్రతిష్టాత్మక 71వ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ముంబైలో మిస్ ఇండియా 2022 పోటీల ముగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కృతి సనన్, లారెన్ గాట్లీబ్ లు డ్యాన్స్ తో అలరించారు. ఈ కార్యక్రమానికి మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరించారు.