పోలీసులకు కరీనా కపూర్ చెప్పింది ఇదే..!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై డుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు.

By Medi Samrat  Published on  18 Jan 2025 5:04 PM IST
పోలీసులకు కరీనా కపూర్ చెప్పింది ఇదే..!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై డుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని, దాదాపు ఆరు సార్లు కైఫ్ ను కత్తితో పొడిచాడని కరీనా తెలిపింది. అయితే ఇంట్లో ఉన్న వస్తువులను దొంగిలించలేదని చెప్పారు. చిన్న కుమారుడు జేహ్, కేర్ టేకర్ ను కాపాడే ప్రయత్నంలో దుండగుడితో సైఫ్ పోరాడారని, ఆ సమయంలోనే సైఫ్ పై దుండగుడు దాడి చేశాడని కరీనా తెలిపారు. దాడి తర్వాత ఎంతో కంగారుపడ్డానని, ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు. తనకు ధైర్యం చెప్పడానికి వెంటనే తన అక్క కరిష్మా కపూర్ వచ్చిందని, తనను ఆమె ఇంటికి తీసుకెళ్లిందని కరీనా తెలిపారు.

లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైద్యులు ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సైఫ్ పై దాడికి పాల్పడ్డ దుండగుడి కోసం పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. వసాయి-విరార్ ప్రాంతాల వైపు లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసినట్టు అనుమానిస్తున్నారు.

Next Story