కరీనా కపూర్ కు మూడో బిడ్డ అంటూ ప్రచారం చేయడం ఏంటండీ..!
Kareena Kapoor introduces us to her ‘third child’, her book Pregnancy Bible. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే
By Medi Samrat Published on 9 July 2021 5:36 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలోనే కరీనా కపూర్ కు మూడో బిడ్డ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇంతకూ అసలు మ్యాటర్ ఏమిటంటే.. కరీనా కపూర్ రాసిన ఓ బుక్..! ఆమె తన బుక్ ను తన మూడో బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు. కానీ కొందరేమో.. ఆమెకు నిజంగానే మూడో బిడ్డ పుట్టిందేమో అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టేశారు.
పుస్తకం తనకు మూడో బిడ్డ అంటూ కరీనా పోస్ట్ చేసింది. ఈ పుస్తకం ద్వారా మంచి రైటర్ అని కూడా నిరూపించుకుందని కొందరు బెబోను ప్రశంసిస్తూ ఉన్నారు. తాజాగా ఆమె `ప్రెగ్నెన్సీ బైబిల్` పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. తాజాగా దాన్ని ఆవిష్కరించింది కరీనా. అంతేకాదు ఈ పుస్తకం తనకు మూడో బిడ్డలాంటిదని తెలిపింది. వంటగదిలో అవెన్ లోంచి హాట్ హాట్ కాపీని బయటకు తీయడం విశేషం. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి అనుభవాలు, నిపుణులు సలహాలు, సూచనలను చెప్పుకొచ్చారు.
కరీనా, సైఫ్ అలీ ఖాన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న కరీనా తన రెండో కుమారుడికి జన్మనిచ్చింది. కరీనా కపూర్ 2020లో తన మొదటి బిడ్డ తైమూర్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా కరీనా 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. కాబోయే తల్లులకు సహాయకారిగా ఉండేలా కీలకమైన చిట్కాలను, సమాచారాన్ని తన బుక్ లో రాయబోతున్నట్టు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డ పుట్టాడు. ఇంతలో ఆమెకు మూడో బిడ్డ ఈ పుస్తకం అంటూ ప్రచారం చేస్తున్నారు. అయినా కరీనానే ఈ పుస్తకం తన మూడో బిడ్డ అని చెప్పుకోగా లేనిది ప్రచారం చేస్తున్న వాళ్లు చెప్పడంలో తప్పేమీ లేదేమో..!