కరీనా కపూర్, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్

Kareena Kapoor and Amrita Arora test Covid positive. బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. కరోనా పరీక్షల్లో.. మహమ్మారి వైరస్‌ సోకినట్లు తేలింది.

By అంజి  Published on  13 Dec 2021 5:28 PM IST
కరీనా కపూర్, అమృతా అరోరాలకు కరోనా పాజిటివ్

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. కరోనా పరీక్షల్లో.. మహమ్మారి వైరస్‌ సోకినట్లు తేలింది. కరీనా కపూర్‌తో పాటు మరో నటి అమృతా అరోరాకు కూడా కరోనా వైరస్‌ సోకింది. సన్నిహిత మిత్రులైన ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఇటీవల ముంబైలో కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటించకుండా చాలా పార్టీలకు హాజరైనట్లు గుర్తించారు. వారు చాలా మంది వ్యక్తులతో పరిచయం కలిగి ఉన్నందున ఇది ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి. కరీనా కపూర్, అమృతా అరోరా సన్నిహిత స్నేహితులు. వీరు తరచుగా కలిసి పార్టీలు చేసుకుంటారు.

ఇటీవల ఇద్దరు స్నేహితులు ముంబైలో కరిష్మా కపూర్, మలైకా అరోరాతో తిరుగుతూ కనిపించారు. బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కరీనా, అమృతతో కాంటాక్ట్‌ అయిన వారు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసుకోవాలని కోరింది. అయితే క‌రీనా, అమృతాకు సోకింది కొత్త వేరియంట్‌ ఒమిక్రానా.. కాదా అన్న విష‌యం ఇంకా తెలియ లేదు. ఇటీవల ప్రముఖ నటుడు కమల్ హాసన్ కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. నవంబర్ 22న కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.


Next Story