OTT విడుదలకు సిద్ధమైన 'కన్నప్ప'
ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడిన సినిమాలలో కన్నప్ప కూడా ఉంది.
By Medi Samrat
ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడిన సినిమాలలో కన్నప్ప కూడా ఉంది. మంచు విష్ణు నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ OTT విడుదలకు సంబంధించి చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు కన్నప్ప OTT విడుదలను మంచు విష్ణు స్వయంగా అధికారికంగా ప్రకటించారు. కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి పలువురు ప్రముఖ నటులు కనిపించారు. శివునికి భక్తితో తన రెండు కళ్లను అర్పించిన ప్రసిద్ధ కన్నప్ప కథ ఈ చిత్రంలో చూపబడింది.
థియేట్రికల్ విడుదలైన రెండు నెలల తర్వాత.. విష్ణు మంచు తన అధికారిక X హ్యాండిల్‌లో కన్నప్ప OTT విడుదలను ప్రకటించారు. కన్నప్ప 4 సెప్టెంబర్ 2025న OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విఫలమైంది. SACNL నివేదిక ప్రకారం.. కన్నప్ప కలెక్షన్లు భారత్‌లో కేవలం రూ. 32 కోట్లు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 46 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మీడియా కథనాల ప్రకారం.. కనప్ప చిత్రం భారీ బడ్జెట్ చిత్రం.