డబ్బులు అడిగితే ఇవ్వకండి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపేంద్ర..!

కన్నడ స్టార్‌ ఉపేంద్ర తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు.

By -  Medi Samrat
Published on : 15 Sept 2025 8:50 PM IST

డబ్బులు అడిగితే ఇవ్వకండి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపేంద్ర..!

కన్నడ స్టార్‌ ఉపేంద్ర తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కాల్‌ వస్తే స్పందించవద్దని కోరారు. తన ఫోన్ హ్యాక్‌ చేశారని, తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ కూడా ఇవ్వొద్దని ఉపేంద్ర ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్‌ చేశారని, కొన్ని హ్యాష్‌ట్యాగ్స్‌, నంబర్లు ఎంటర్‌ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పారన్నారు ఉపేంద్ర. ఆ కాల్ తర్వాతే ఫోన్‌ హ్యాక్‌ అయిందని తెలిపారు.

ఇటీవల నటి లక్ష్మీ మంచు ఫోన్ కూడా హ్యాక్ అయింది. ఈ మోసం గురించి అభిమానులకు ముందస్తుగా హెచ్చరిస్తూ, తనకు ఎప్పుడైనా డబ్బు అవసరమైతే, తాను దానిని స్వయంగా అడుగుతానని ఆమె అన్నారు. ‘మార్కో’ నటుడు ఉన్ని ముకుందన్ కూడా హ్యాకింగ్‌ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని మలయాళ నటుడు అభిమానులను హెచ్చరించారు.

Next Story