డ్రగ్స్ కేసులో సినీ నటి రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..! ఆమె బెయిల్ కోసం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూ ఉండగా.. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో ద్వివేది, ఇతరులకు బెయిల్ ఇవ్వడానికి నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తనను ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
కన్నడ చిత్ర సీమలోని ఎంతో మంది నటీనటులు డ్రగ్స్‌కు బానిసయ్యారని.. షూటింగ్స్, రేవ్ పార్టీల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ ఇంద్రజిత్ లంకేష్ ఆరోపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటూ మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగిణి నిందితురాలే అని.. ఆమెకు కచ్చితంగా డ్రగ్ డీలర్స్‌తో సంబంధాలున్నాయని.. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని బెంగుళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు చెబుతూ వచ్చారు. డ్రగ్స్ మాఫియా కేసులో రాగిణిని గతేడాది సెప్టెంబర్ 4న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. గంజాయితో నింపిన సిగరెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు మొబైల్స్ సీజ్ చేశారు