నటుడు మన్‌దీప్ రాయ్ కన్నుమూత‌

Kannada actor Mandeep Roy passes away. ప్రముఖ కన్నడ నటుడు మన్‌దీప్ రాయ్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ వర్గాలు

By Medi Samrat
Published on : 29 Jan 2023 12:43 PM

నటుడు మన్‌దీప్ రాయ్ కన్నుమూత‌

ప్రముఖ కన్నడ నటుడు మన్‌దీప్ రాయ్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆయన వయసు 74 సంవ‌త్స‌రాలు. దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించిన మన్‌దీప్ రాయ్ గుండెపోటుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.

నటుడు-దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్‌ ప్రకారం.. మన్‌దీప్ రాయ్ బెంగాలీ. ఆయ‌న బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించి, రాణించాడు. మన్దీప్ రాయ్ నిజానికి బెంగాలీ, బెంగుళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించి, కన్నడ ప్రజలతో సన్నిహితంగా మెలిగిన ఆయన మరచిపోలేని వ్యక్తి" అని భరద్వాజ్ ట్వీట్ చేశారు.

థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన మన్‌దీప్ రాయ్.. మించిన ఓట, పుష్పక విమానం, దేవర ఆట, నాగరహావు, ఆప్త రక్షక, అమృతధారే, కురిపాలు సార్ కురిపాలు వంటి సినిమాల్లో న‌ట‌న‌తో తనదైన ముద్ర వేశారు.


Next Story