వ‌చ్చే సంవ‌త్స‌రానికి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' వాయిదా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా పడింది.

By Medi Samrat  Published on  16 Oct 2023 9:37 PM IST
వ‌చ్చే సంవ‌త్స‌రానికి కంగనా రనౌత్ ఎమర్జెన్సీ వాయిదా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఎమర్జెన్సీ' రిలీజ్ వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పొలిటికల్ డ్రామాను 2024కి వాయిదా వేస్తున్నట్టు ఆమె తెలియజేసింది. మొదట్లో ఈ చిత్రాన్ని నవంబర్ 24, 2023న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఈ ఏడాది ఎండింగ్ లో భారీ సినిమాలు వస్తూ ఉండడంతో ఎమర్జెన్సీ సినిమాను 2024 సంవత్సరానికి వాయిదా వేశారు.

'ఎమర్జెన్సీ' సినిమాని 2024కి వాయిదా వేస్తున్నట్టు కంగనా రనౌత్ కూడా తెలియజేసింది. ఎమర్జెన్సీ సినిమా కోసం తన జీవితంలో సంపాదించుకున్న డబ్బును అంతా ధారపోశానని తెలిపింది. ఎమర్జెన్సీ తనకు సినిమా మాత్రమే కాదని అంతకు మించి అని తెలిపింది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తమని మరింత ప్రోత్సహించిందని.. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎమర్జెన్సీ విడుదల తేదీ గురించి అడుగుతున్నారని తెలిపింది. ఎమర్జెన్సీ విడుదల తేదీని నవంబర్ 24, 2023గా ముందు ప్రకటించాము.. కానీ తన సినిమాలు వరుసగా రిలీజ్ ఉండడం వల్ల 2024 సంవత్సరానికి ఎమర్జెన్సీ మూవీని వాయిదా వేస్తున్నామని కంగనా తెలిపింది. భారతదేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపిస్తోంది.

ప్రస్తుతం కంగనా రనౌత్ 'తేజస్' సినిమాలో నటిస్తోంది. కంగనా రనౌత్‌ ఫైటర్ జెట్ పైలట్‌ తేజాస్ గిల్ పాత్రలో నటిస్తోంది. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్‌, వరుణ్ మిత్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 27న ఎంతో గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది.

Next Story