'తలైవి' షూటింగ్‌ పూర్తి.. కంగ‌నా భావోద్వేగ‌పు ట్వీట్‌

Kangana Ranaut wraps up shooting for Thalaivi and pens down an emotional post. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత

By Medi Samrat
Published on : 13 Dec 2020 6:26 PM IST

తలైవి షూటింగ్‌ పూర్తి.. కంగ‌నా భావోద్వేగ‌పు ట్వీట్‌

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయ‌ల‌లిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం తలైవి. ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూరైన సంద‌ర్భంగా కంగనా కాస్త ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసింది.

ఈ మూవీ షూటింగ్, తన అనుభవం గురించి పేర్కొంటూ.. 'నేను ఈ పాత్ర‌తో ప్రేమ‌లో ప‌డిపోయాను. ఇప్పుడు ఈ సినిమాకు ముగింపు ప‌ల‌క‌డం చాలా బాధ‌గా, క‌ష్ట‌త‌రంగా ఉంది. మిశ్ర‌మ భావోద్వేగాలతో మ‌న‌సు నిండిపోయింది' అంటూ కంగనా ఎమోషనల్ అయ్యారు. అర‌వింద స్వామి, డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్‌ వంటి స్టార్స్‌తో క‌లిసి న‌టించ‌డం జీవితంలో దొరికే అదృష్టంగా భావిస్తున్నాను.

ఇటువంటి సినిమా యూనిట్‌ను వదిలిపోతుండడం బాధగా ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలో అన్ని భావోద్వేగాలు తనలో ఉన్నాయని తెలిపింది. ప్ర‌తి ఒకరికీ మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను అని చెప్పింది. ఈ సందర్భంగా జయలలిత ఫొటోతో పాటు జయలలిత పాత్రలోని తన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది.




Next Story