కొత్తగా విడుదలైన ఆ సినిమాను తీవ్రంగా విమర్శించిన కంగనా..

Kangana Ranaut Calls Deepika Padukones Gehraiyaan a porn film. కంగనా రనౌత్ మరోసారి తన వాయిస్ ను వినిపించింది. 'గెహరాయియా' అనే సినిమా

By Medi Samrat  Published on  13 Feb 2022 1:58 PM GMT
కొత్తగా విడుదలైన ఆ సినిమాను తీవ్రంగా విమర్శించిన కంగనా..

కంగనా రనౌత్ మరోసారి తన వాయిస్ ను వినిపించింది. 'గెహరాయియా' అనే సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దీపిక పదుకోన్, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది నటించారు. కంగనా రనౌత్, సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడే వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన దీపికా పదుకోన్ చిత్రం 'గెహరాయియా'పై విరుచుకుపడింది. 1965 చిత్రం 'హిమాలయ్ కి గోద్ మే' నుండి ఒక వీడియో క్లిప్‌ను పంచుకుంటూ, కంగనా విమర్శలు చేసింది.

"I am also a millennial but I identify and understand this kind of romance.. in the name of millennial/new age/urban movies don't sell trash pls"."bad movies are bad movies no amount of skin show or pornography can save it ... it's a basic fact koi gehraiyaan wali baat nahi hai". అంటూ పోస్టు పెట్టింది. మిలీనియల్/న్యూ ఏజ్/అర్బన్ సినిమాల పేరుతో చెత్తను అమ్మండి ప్లీజ్ అని తన పోస్టు ద్వారా కంగనా చెప్పుకొచ్చింది. "చెత్తటి సినిమాలు చెత్త సినిమాలే, ఎంతటి స్కిన్ షో లేదా అశ్లీలత అయినా దానిని రక్షించలేవు .. ఇది ప్రాథమిక వాస్తవం.. కోయి గెహరాయియా వాలీ బాత్ నహీ హై" అంటూ విమర్శలు గుప్పించింది

దీపిక తన మానసిక ఆరోగ్య సంస్థతో డిప్రెషన్ 'వ్యాపారం' నడుపుతోందని కంగనా గతంలో ఆరోపించింది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన గెహరాయియాలో దీపిక, ఆమె సహనటుడు సిద్ధాంత్ చతుర్వేది మధ్య కొన్ని సన్నిహిత సన్నివేశాలు ఉన్నాయి.


Next Story
Share it