రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్
Kamal Haasan's Vikram earns over Rs 200 crore even before release. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా విడుదలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది.
By Medi Samrat Published on 30 May 2022 11:56 AM ISTకమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా విడుదలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే రూ.200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, విక్రమ్ శాటిలైట్, OTT హక్కులు (బహుళ భాషలలో) రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. విక్రమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యధికంగా చెబుతున్నారు. భారీ అంచనాలున్న సినిమాల్లో విక్రమ్ కూడా ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ జూన్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరో సూర్య కూడా సినిమాలో కనిపించనున్నాడనే కథనాలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా ఆకట్టుకుంటూ ఉంది.
#Vikram / #VikramHitlist - Highest Pre-release Business for #KamalHaasan
— Ramesh Bala (@rameshlaus) May 30, 2022
More than ₹ 200 Crs+ including Satellite and OTT in Multiple Languages..
ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో విక్రమ్ 200 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్‌లో తెలియజేశారు. "#Vikram / #VikramHitlist - Highest Pre-release Business for #KamalHaasan. More than Rs 200 Crs+ including Satellite and OTT in Multiple Languages (sic)." అంటూ రమేష్ బాలా ట్వీట్ చేశాడు.
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలతో రూపొందించబడిన 'విక్రమ్' ఒక వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నిర్మించారు. నరేన్, కాళిదాస్ జయరామ్, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్ నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.