దయచేసి నన్ను అలా పిలవకండి : కమల్ రిక్వెస్ట్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులలో నటుడు కమల్ హాసన్ ఒకరు. ఆయన్ను ఉలగనాయగన్ అని పిలుస్తారు.

By Medi Samrat  Published on  11 Nov 2024 6:43 PM IST
దయచేసి నన్ను అలా పిలవకండి : కమల్ రిక్వెస్ట్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులలో నటుడు కమల్ హాసన్ ఒకరు. ఆయన్ను ఉలగనాయగన్ అని పిలుస్తారు. అదే టైటిల్‌ని ఆయన తెలుగు అభిమానులు, ప్రేక్షకులు లోకనాయకుడు అని కూడా ఉపయోగించారు. అయితే కమల్ హాసన్ ఇప్పుడు తనను ఉలగనాయగన్/లోకనాయకుడు అని పిలవడం మానేయాలని విజ్ఞప్తి చేశారు.

తనను అలా ప్రస్తావించడంలో ప్రేక్షకుల ప్రేమ, ఆప్యాయత తనకు అర్థమవుతాయని కమల్ హాసన్ అన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కళాకారుడు కళ కంటే ఉన్నతంగా ఎదగకూడదనేది తన నమ్మకమని ఆయన అన్నారు. అందుకే, ఇకపై అటువంటి టైటిల్స్ లేదా ప్రిఫిక్స్‌లన్నింటినీ గౌరవప్రదంగా తిరస్కరించాలని తాను భావించినట్లు ఆయన తెలిపారు. తనను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కెహెచ్ అని పిలవాలని అభ్యర్థించారు. అయితే ఆయన హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలియదు. విక్రమ్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న కమల్ ప్రస్తుతం 'థగ్ లైఫ్‌' సినిమాతో బిజీగా ఉన్నారు.

Next Story